ఈ లోన్ యాప్స్ చాలా డేంజర్..

- December 09, 2023 , by Maagulf
ఈ లోన్ యాప్స్ చాలా డేంజర్..

గూగుల్ ప్లే స్టోర్ నుండి అనేక మిలియన్ల డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్న 18 స్పై యాప్‌లను గూగుల్ ఇటీవల తొలగించినట్లు ఈసెట్(ESET)ఓ నివేదికలో తెలిపింది. ఏడాది కాలంలో గూగుల్ ప్లే స్టోర్ స్పై లోన్ గా 18 యాప్‌లు గుర్తించారని ఆ నివేదిక వెల్లడించింది. ఈ లెండింగ్ యాప్‌లు వినియోగదారుల పరికరాల నుంచి అధిక మొత్తంలో సమాచారాన్ని సేకరించడం ద్వారా వారిపై నిఘా పెట్టడానికి రూపొందించబడ్డాయని నిర్ధారించింది.

అవసరాన్ని ఆసరా చేసుకుంటున్నారు నేరగాళ్లు. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో లోన్లు తీసుకుంటున్నారు. అవి కూడా ప్రైవేటు లోను యాప్ ల నుంచి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేటు ఇన్ స్టంట్ లోన్ యాప్స్ ఎటువంటి పత్రాలు అడగకపోవడం, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్లు ఇస్తామనడటం, తక్కువ వడ్డీ అంటూ మాయమాటలు చెప్పి బాధితులను తమ తిప్పుకుంటున్నారు. తీరా యాప్ డౌన్ లోడ్ చేసి అప్పు ఇచ్చాక వారి ఫోన్లలో డేటాను దొంగతనంగా వారి యాప్ ద్వారా చోరీ చేసి, అప్పు తీసుకున్న వారికి వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల వెలుగుచూస్తున్న నేపథ్యంలో గూగుల్ మరోసారి కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఫోన్లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత దానిలో డేటాను చోరీ చేస్తున్నట్లు గుర్తించిన 17 లోన్ యాప్ లను గూగల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

17 స్పై యాప్స్..
గూగుల్ ప్లే స్టోర్ నుండి అనేక మిలియన్ల డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్న 18 స్పై యాప్‌లను గూగుల్ ఇటీవల తొలగించినట్లు ఈసెట్(ESET)ఓ నివేదికలో తెలిపింది. ఏడాది కాలంలో గూగుల్ ప్లే స్టోర్ స్పై లోన్ గా 18 యాప్‌లు గుర్తించారని ఆ నివేదిక వెల్లడించింది. ఈ లెండింగ్ యాప్‌లు వినియోగదారుల పరికరాల నుంచి అధిక మొత్తంలో సమాచారాన్ని సేకరించడం ద్వారా వారిపై నిఘా పెట్టడానికి రూపొందించబడ్డాయని నిర్ధారించింది. ఈ సమాచారం తరువాత రుణగ్రహీతలను బ్లాక్‌మెయిల్ చేయడానికి, అధిక వడ్డీ మొత్తాలను డిమాండ్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నట్లు స్పష్టం చేసింది.

రహస్య పరిశోధన..
ఈసెట్ పరిశోధకులు లోన్ షార్క్‌లు ఉపయోగించే యాప్‌ల వివరాలను కొంత వ్యక్తులకు వివరించి, వారిని వినియోగదారులుగా నియమించి డౌన్ లోడ్ చేయించారు. వాస్తవానికి ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో నివసిస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ18 యాప్‌లలో 17 యాప్‌లను సెర్చ్ దిగ్గజం తొలగించినట్లు భద్రతా సంస్థ తెలిపింది. మరొకటి మాత్రం యాప్ కొత్త వెర్షన్ తీసుకురావడంతో దానిని కొనసాగించినట్లు ఈసెట్ చెప్పుకొచ్చింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ యాప్‌లను గూగుల్ తీసివేసినప్పటికీ, వినియోగదారులు తమ ఫోన్‌ల నుంచి వాటిని మాన్యువల్‌గా తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే అవి వాటి పని అవి చేసుకుంటాయి. కాబట్టి ఈ కింద పేర్కొన్న 17 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com