నరేంద్రమోదీ మంత్రి వర్గంలో త్వరలో మార్పులు
- May 27, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో త్వరలోనే మార్పులుచేర్పులు జరగనున్నాయి. ఈ విషయాన్ని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వెల్లడించారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అమిత్‌షా.. కేబినెట్ శాఖల్లో మార్పులు జరగనున్నట్లు తెలిపారు. అయితే మార్పుల ప్రక్రియకు ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే జూన్ మొదటివారంలో కేబినెట్‌లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులను మార్చేందుకు ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు శర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో క్రీడాశాఖ ఖాళీ అయింది. దీంతో కేబినెట్‌లోకి కొత్త మంత్రులు రానున్నారు. అంతేగాక.. కొన్ని శాఖల్లో పనితీరు సరిగా లేకపోవడంతో ఆయా మంత్రులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే.. సీనియర్ భాజపా నేతలు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్‌గడ్కరీ మాత్రం కేబినెట్‌లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







