మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయడం తెలుసా?
- December 12, 2023
న్యూ ఢిల్లీ: ప్రతి భారతీయ పౌరులు ఎవరైనా తమ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం తప్పనిసరి. కార్డ్ హోల్డర్లందరికీ పాన్ కార్డ్‌లను ఆధార్‌తో లింక్ చేయడాన్ని భారత ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఆధార్, పాన్ లింకింగ్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలనేది చాలామందికి అవగాహన ఉండదు.
కొంతమంది పాన్ కార్డు ఆధార్ లింక్ చేసుకున్నా తర్వాత అది పూర్తి స్థాయిలో లింక్ అయిందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదని గమనించాలి. అందుకే ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్లో ఆధార్, పాన్ లింక్ అయిందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్‌ను ఆధార్‌తో ఎందుకు లింక్ చేయాలి?
ఆధార్‌తో పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ను లింక్ చేయాలి. తద్వారా పన్ను చెల్లింపులు, టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్‌లు, ఆదాయ రిటర్న్‌లు, లావాదేవీలు, కరస్పాండెన్స్‌లతో సహా వ్యక్తిగత లావాదేవీలను క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది.
గడువు తేదీ ముగిసింది:
జూన్ 30 అనేది పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన నిర్ణీత గడువు. జూలై 1 తర్వాత పాన్ కార్డ్ పని చేయకపోవటంతో రెండు కార్డ్‌లను లింక్ చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలను ఓసారి పరిశీలించండి.
ధృవీకరణ ప్రక్రియ:
పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో పాన్ కార్డు ఎలా ధృవీకరించాలో తెలుసుకోండి. మీ పాన్ కార్డ్ యాక్టివ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం.
ఐటీఆర్ తిరస్కరణ:
మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు దాఖలు చేసిన ఐటీఆర్ రిజక్ట్ అయితే మీ పాన్ కార్డు ఆధార్ లింక్ అయిందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
మినహాయింపులు:
80 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. నివాసితులు కానివారు, భారత పౌరులు కాని వారితో సహా ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం నుంచి మినహాయించిన నిర్దిష్ట గ్రూపులుగా చెప్పవచ్చు.
లింకింగ్ ప్రక్రియకు అవసరమైనవి:
వ్యాలీడ్ పాన్ కార్డు–యాక్టివ్ మొబైల్ నంబర్
పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేయడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించవచ్చు.
- ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ (http://incometax.gov.in/iec/foportal/)ను విజిట్ చేయండి.
- Quick Links సెక్షన్ నావిగేట్ చేయండి. లింక్ ఆధార్ స్టేటస్ ఎంచుకోండి.
- పాన్, ఆధార్ కార్డ్ నంబర్‌లను ఎంటర్ చేయండి
- ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- స్క్రీన్ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది.
- పాన్ కార్డ్, ఆధార్ లింక్ అయితే స్క్రీన్ ‘Linked’ అని సూచిస్తుంది.
- లింక్ చేయకపోతే.. రెండు కార్డ్‌లను లింక్ చేయడానికి అవసరమైన వివరాలను సూచిస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







