క్యాంటీన్‌లో ఘర్షణకు దిగిన లాయర్లు..
- December 13, 2023
న్యూ ఢిల్లీ: క్యాంటీన్‌లో లంచ్ చేద్దామని వచ్చిన కొందరు లాయర్లు సీటు కోసం ఘర్షణకు దిగారు. ప్రశాంతంగా ఉండే క్యాంటీన్ వాతావరణాన్ని చెడగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఢిల్లీ హైకోర్టు లాయర్లు క్యాంటీన్‌లో సీటు కోసం కొట్టుకున్నారు. లాయర్ల మధ్య జరిగిన ఘర్షణతో క్యాంటీన్‌లోని టేబుళ్లపై ఆహార పదార్థాలు పడి పాడైపోయాయి. భోజనం చేస్తున్న ఇతర లాయర్లు ఇబ్బంది పడ్డారు. ఓ లేడీ సీనియర్ అడ్వకేట్‌ను మరో మహిళా లాయర్ చెంపపై కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
భోజనానికి వచ్చిన లాయర్ల వద్దకు ఓ లేడీ లాయర్ దూసుకువచ్చి గొడవ పెట్టుకుందని అన్నారు. ఆమెకు సర్ది చెప్పేందుకు కొందరు సీనియర్ లాయర్లు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ లేడీ లాయర్ వినిపించుకోలేదు. టేబుళ్లపై ఉన్న ఆహార పదార్థాలను ఆమె చెల్లాచెదురు చేశారు.
ఓ లాయర్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జరిగిన గొడవ గురించి చెప్పారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో చూడొచ్చు. భోజనం చేస్తున్న వారంతా ఈ గొడవ సమయంలో నిలబడాల్సి వచ్చింది. లాయర్లు ఇంతలా గొడవ పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







