సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..
- December 13, 2023
హైదరాబాద్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఆల్రెడీ ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మూవీ నుంచి మొదటి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
సూర్యుడే గొడుగు పట్టి.. అంటూ సాగే ఈ సాంగ్ లో ప్రభాస్, పృథ్వి రాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపించబోతున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కృష్ణ కాంత్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించగా హరిణి ఇవతూరి ఈ పాటని పాడారు. ఎమోషనల్ గా ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ ని, సాంగ్ ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట. ఈ సెకండ్ ట్రైలర్ ని పూర్తి యాక్షన్ కట్ తో రెడీ చేయబోతున్నారు.
అలాగే ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రభాస్, పృథ్వీరాజ్, శృతిహాసన్, ప్రశాంత్ నీల్ తో కలిపి ఒక ఇంటర్వ్యూని కూడా ప్లాన్ చేశారట. కాగా ఈ మూవీ ‘A’ సర్టిఫికెట్ తో 2 గంటల 55 నిమిషాల 22 సెకన్ల రన్టైమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నుంచి ఒక మంచి సినిమా రాక రెబల్ అభిమానులు నిరాశలో ఉన్నారు. మరి వారికీ ఈ సినిమా ఉత్సాహాన్ని ఇస్తుందా లేదా చూడాలి. కాగా ఈ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ‘ఉగ్రమ్’ రీమేక్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలని సలార్ నిర్మాత.. నిజం లేదని కొట్టిపారేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







