ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర
- December 19, 2023
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్ తన సుదీర్ఘ పాదయాత్రకు ముగింపు పలికారు. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. యువనేతతో తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబసభ్యులు కలసి ఈ పాదయాత్రలో నడిచారు. లోకేష్‌కి సంఘీభావంగా వేలాదిమంది ప్రజలు కలసి నడిచారు. శివాజీనగర్ వద్ద పైలాన్‌ను లోకేష్ ఆవిష్కరించారు. దీంతో గాజువాక ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది.
ఇక ఈ నెల 20 న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, తాను హాజరు కాలేనని తొలుత పవన్ టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరవుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ‘యువగళం’ సభకు హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగిసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో నిల్వ ఉన్న ఇరాన్‌కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: అధ్యక్షుడు పెజె
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!







