'కేఎస్ఏ వీసా'ను ప్రారంభించిన సౌదీ అరేబియా
- December 20, 2023
రియాద్: సౌదీ అరేబియా మంగళవారం ఏకీకృత వీసా ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది వీసా దరఖాస్తు ప్రక్రియలను సులభతరం చేయడానికి 'KSA వీసా' ను తీసుకొచ్చింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగం అని మంగళవారం రియాద్‌లోని డిజిటల్ గవర్నమెంట్ ఫోరమ్ (DGF)ని ఉద్దేశించి విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కార్యనిర్వాహక వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్హాదీ అల్మాన్సౌరి మాట్లాడుతూ వెల్లడించారు. ఈ ప్లాట్‌ఫారమ్ 30 కంటే ఎక్కువ ఏజెన్సీలు, మంత్రిత్వ శాఖలు మరియు ప్రైవేట్ రంగానికి అనుసంధానించబడిందని తెలిపారు. హజ్ వీసా లేదా ఉమ్రా లేదా టూరిజం అలాగే వర్క్ వీసాల ప్రయోజనం కోసం విజిట్ వీసాతో సహా వివిధ రకాల వీసాలను పొందే విధానాలను సులభతరం చేయడానికి, GOV.SA ప్లాట్‌ఫారమ్ కంటే ఎక్కువ సాధికారత కల్పించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కొత్త సౌదీ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రయత్నాలతో సమానంగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా 2023 సంవత్సరంలో సౌదీ అరేబియా 18.6 మిలియన్లకు పైగా వీసాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







