స్కిల్డ్ ఇండియన్ కార్మికులకు సౌదీ అరేబియా టాప్ డెస్టినేషన్
- December 20, 2023
న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లలో (SIIC) శిక్షణ పొందిన దాదాపు 14,000 మంది భారతీయులు ఏప్రిల్ 2022 మరియు డిసెంబర్ 2023 మధ్య సౌదీ అరేబియాలో ఉద్యోగాలు పొందారని భారత మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం లోక్‌సభలో తెలిపారు. డేటా ప్రకారం, 13,944 మంది నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు సౌదీ అరేబియాలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ తరువాత ఖతార్ (3,646), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2,832) మరియు యునైటెడ్ కింగ్‌డమ్ (1,248) ఉన్నాయి. మొత్తంగా 25,300 మంది అభ్యర్థులకు విదేశాలలో ఉపాధి లభించిందని ఆయన వివరించారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఖతార్, యూఏఈ, యూకే వంటి ఎనిమిది దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







