యూఏఈలో స్లో డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా!
- December 20, 2023
యూఏఈ: స్పీడ్ రోడ్లపై స్లో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. ముఖ్యంగా హై స్పీడ్ లేన్లలో ఇది ప్రాణాంతకం. దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడమ నుండి మొదటి లైన్ అత్యవసర రెస్పాండ్ వాహనాల కోసం కేటాయించారు. మొదటి లేన్ అవసరమైతే తప్ప వినియోగించవద్దు. కానీ గరిష్టంగా అనుమతించిన వేగ పరిమితిలో డ్రైవ్ చేయడానికి యూఏఈ నివాసితులు దీనిని తరచుగా ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. 140 కిలోమీటర్ల రహదారిపై మొదటి రెండు లేన్లలో 130 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసే వ్యక్తులు అకస్మాత్తుగా 100 కిలోమీటర్ల లోపు వెళ్లడం చాలా ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హై స్పీడ్ రోడ్లపై నెమ్మదిగా డ్రైవింగ్ చేయకుండా ఉండటానికి అధికారులు జరిమానాలు అమలు చేశారు. దుబాయ్ మరియు అబుదాబిలను కలిపే షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో ఏప్రిల్ 2023 జరిమానాలను విధిస్తున్నారు. ఉదహరణకు 140 కిలోమీటర్ల రహదారి మొదటి రెండు లేన్లలో 120 కిలోమీటర్ల లోపు డ్రైవింగ్ చేస్తే అబుదాబి పోలీసులు Dh400 జరిమానాను విధిస్తున్నారు. నివాసితులకు అధికారికంగా జారీ అవుతున్న నిబంధనలను తెలుసుకోవాలని దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA), యూఏఈ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







