సౌదీయేతర నంబర్ ప్లేట్‌లపై ‘మురూర్’ కీలక ఆదేశాలు
- December 22, 2023
రియాద్: సౌదీయేతర నంబర్ ప్లేట్‌లు కలిగిన వాహనాలను లైసెన్స్ జారీ చేసిన దేశంలోని పౌరులు మాత్రమే నడపాలని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) స్పష్టం చేసింది. ఈ విషయంలో ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని, ఇటాంటి ఉల్లంఘనలపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సౌదీయేతర లైసెన్స్ ప్లేట్‌లను కలిగి ఉన్న కార్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి అన్ని ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఆదేశఆలు జారీ చేసిందన్నారు. సౌదీయేతర నంబర్ ప్లేట్‌లను కలిగి ఉన్న కార్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసినట్లు మురూర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







