దుబాయ్ లో డెలివరీ రైడర్లందకీ త్వరలో ఎలక్ట్రిక్ బైక్‌లు
- December 22, 2023
దుబాయ్: ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్‌లకు మారడానికి డెలివరీ కంపెనీల కోసం ప్రోటోటైప్ ఇ-బైక్‌ను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) గురువారం ప్రవేశపెట్టింది. దీంతో భవిష్యత్ వాణిజ్య రవాణా సేవల పరిధిని విస్తరించడం, మెరుగుపరచడం, సున్నా-ఉద్గార రవాణా మార్గాల వైపు మార్పును వేగవంతం చేయడం అని ఆర్టీఏ లైసెన్సింగ్ ఏజెన్సీలో వాణిజ్య రవాణా కార్యకలాపాల డైరెక్టర్ ముహన్నద్ ఖలీద్ అల్ ముహైరి తెలిపారు. డెలివరీ రైడర్లకు తగిన ప్రోటోటైప్ ఇ-బైక్ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ నిపుణులతో ఆర్టీఏ సహకరించిందని అల్ ముహైరి చెప్పారు. ఈ-బైక్‌ల కోసం దుబాయ్ అంతటా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఇ-బైక్‌లకు మారడం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుందని అల్ ముహైరి వివరించారు. కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించేందుకు దుబాయ్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్టీఏ ప్రయత్నిస్తోందని అల్ ముహైరి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు







