కబాబ్ దిల్‌రూబా
- May 28, 2016
కావాల్సినవి: చికెన్ కైమా 250 గ్రా., సుమారైన ఉల్లిపాయ ఒకటి (చిన్న ముక్కలుగా కోయాలి), టమోటో లేదా ఎర్ర క్యాప్సికం ఒకటి (ముక్కలు కోసుకోండి), అల్లం, వెల్లుల్లి వేరువేరుగా అర టీస్పూను చెప్పున, మిరియాలు (అప్పటికపడు కచ్చాపచ్చాగా కొట్టింది) అర టీస్పూను, గరం మసాలా అర టీస్పూను, కొత్తిమీర (సన్నగా తరిగి) ఒక టేబుల్ స్పూను, నూనె ఒక టీస్పూను, ఉప్పు తగినంత.
తయారుచేసే విధానం
అన్నిట్నీ కలిపి ఒక గంటసేపు పక్కన పెట్టండి. లావాటి ముద్దల్లా చేసుకుని ఇడ్లీ గిన్నెలో ఆవిరిమీద పది నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత నాప్‌కిన్‌తో అద్ది పైన తడి ఏమైనా ఉంటే తీసేయండి. ఆ తర్వాత గ్రిల్‌లో గాని, నాన్‌స్టిక్ మూకుట్లోగాని వేసి పైన కొంచెం నూనెవేసి వేగించండి. చెక్క గరిటెతో ఒత్తుతూ బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగించి దించేయండి. స్నాక్స్‌లా తినడానికి బాగుంటాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







