అయోధ్యలో 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా
- December 30, 2023
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు మోడీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి ఆరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రధాని ప్రారంభించారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీ రూ.15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం. అయోధ్యలో అడుగుపెట్టిన ప్రధానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు తమ ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి అయోధ్య ధామ్ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో కలిసి అయోధ్య ధామ్ స్టేషన్ ను మోడీ ప్రారంభించారు. ఆపై అక్కడి నుంచి అయోధ్య ఎయిర్ పోర్ట్ లో కొత్తగా నిర్మించిన టెర్మినల్ ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అయోధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?