‘బేబీ’ బ్యూటీకి బంపర్ ఆఫర్.!

- December 30, 2023 , by Maagulf
‘బేబీ’ బ్యూటీకి బంపర్ ఆఫర్.!

యూ ట్యూబ్‌లో సెన్సేషనల్ అయిన వైష్ణవీ చైతన్యకు ‘బేబీ’ సినిమాతో మంచి డెబ్యూ పడింది. సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో పాటూ, వైష్ణవీ చైతన్య టాలెంట్ గురించి అంతా మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమాలో ఆమె పర్‌పామెన్స్.

అందుకే ఆమెకు ఆ తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు క్యూ కట్టాయ్. ‘బేబీ’ హిట్ టైమ్‌లోనే దిల్ రాజు కన్నేశాడు వైష్ణవీ చైతన్య మీద. తన బ్యానర్‌లో ఓ సినిమాకి ఆఫర్ ఇచ్చాడు.

ఆ సినిమా లేటెస్ట్‌గా సెట్స్ మీదికి వెళ్లింది. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, అరుణ్ భీమవరపు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.

‘లవ్ మి’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. బబ్లీ గాళ్‌గా ప్లజెంట్ లుక్స్‌లో  వైష్ణవీ చైతన్య కనిపిస్తోంది ఈ స్టిల్‌లో.

లక్కు బాగుండి.. ఈ సినిమా హిట్ అయ్యిందంటే వైష్ణవి టాలీవుడ్‌లో పాతుకుపోవడం ఖాయం. దీంతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులకి వైష్ణవి సైన్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com