శ్రీలీలను అలా కూడా వాడేశారా.?
- January 02, 2024
మంచి నటి అని చెప్పలేం కానీ, కొద్ది కాలంలోనే మంచి క్రేజ్ దక్కించుకుంది తెలుగమ్మాయ్ శ్రీలీల. కన్నడ సినిమా పరిజ్ఞానంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘ధమాకా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, టాలీవుడ్లో పాతుకుపోయింది.
క్షణం కూడా తీరిక లేనంతలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు సరసన ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేస్తోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి.. అనే సాంగ్ వుంది. మాస్, ఊర మాస్ అనే లెవల్లో ఈ సాంగ్ చిత్రీకరణ సాగింది. లేటెస్ట్గా ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అసలే శ్రీలీల మంచి డాన్సర్. ఇక మాస్ సాంగ్ అంటే స్టెప్పులు వీర లెవల్లో ఇరగదీసేసింది.
ఇది ఐటెం సాంగ్ అని చూసిన ప్రేక్షకుల అభిప్రాయం. ఐటెం గాళ్‌తో చేయించాల్సిన ఈ సాంగ్‌ని ఎంత మంచి డాన్సర్ అయితే మాత్రం. హీరోయిన్ అయిన శ్రీలీలతో చేయించేస్తారా..? అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఎంత పాపులారిటీ వుంటే మాత్రం ఐటెం గాళ్లా కూడా శ్రీలీలను వాడేస్తారా.? అంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయ్. అంతేగా.!
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









