యూఏఈలో మరిన్ని వర్షాలు?
- January 05, 2024
యూఏఈ: గత సంవత్సరాలతో పోలిస్తే యూఏఈలో 2023 డిసెంబర్ లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 2024లో క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. యూఏఈలో క్లౌడ్ సీడింగ్ ప్రతి సంవత్సరం కనిష్టంగా 15 శాతం అదనపు వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ సీడింగ్ కార్యకలాపాల నుండి 84 మరియు 419 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉపయోగపడే నీటిని అందిస్తుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. తాజాగా యూఏఈ ఉత్తర ప్రాంతాలలో.. హట్టా, అల్ ఐన్కు ఉత్తరాన ఉన్న కొన్ని ప్రాంతాలు, ఫుజైరాలోని కొన్ని ప్రాంతాలలో క్లౌడ్-సీడింగ్ ఆపరేషన్ లు నిర్వహించినట్లు తెలిపారు. యూఏఈలో ప్రతి సంవత్సరం సగటున 900 గంటలపాటు క్లౌడ్ సీడింగ్ మిషన్లను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







