మైక్రోసాఫ్ట్ అధినేత నేడు ప్రధానమంత్రి మోదీతో భేటీ ..
- May 30, 2016
భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ రంగం, పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో కూడా నాదెళ్ల సమావేశమయ్యారు.
మైక్రోసాఫ్ట్ నిర్వహించిన 'టెక్ ఫర్ గుడ్, ఐడియాస్ ఫర్ భారత్' కార్యక్రమం కోసం సత్య నాదెళ్ల నేడు దిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ వినియోగం ఆవశ్యకతను గురించి వివరించారు. 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెళ్ల భారత్‌కు రావడం ఇది మూడోసారి. భారత్‌లో మైక్రోసాఫ్ట్ 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది నవంబర్‌లో ఆయన తొలిసారిగా భారత్‌కు వచ్చారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో ముంబయికి వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌ను కూడా సందర్శించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







