పేరెంటల్ లీవ్ ప్యాకేజీలు.. మారుతున్న కంపెనీల ఆలోచనలు!
- January 14, 2024
మస్కట్: మెరుగైన పని సంస్కృతులను రూపొందించే దిశగా మరిన్ని సంస్థలు తల్లిదండ్రుల సెలవులను పెంచుతున్నాయి. కొత్త చట్టాల ప్రకారం.. పురుష ఉద్యోగులు ఇప్పుడు ఏడు రోజులపాటు యజమాని-చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవులను పొందవచ్చు. ఒమన్‌లోని ప్రముఖ కేబుల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఒమన్ కేబుల్స్ ఇండస్ట్రీ (OCI).. కొత్త పేరెంటల్ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం బ్రాండింగ్‌ను పెంచడంతోపాటు ఉద్యోగుల నిలుపుదలని బలోపేతం చేస్తుందన్నారు. అదే సమయంలో పూర్తి జీతంతో తల్లులకు ప్రసూతి కవరేజ్ వ్యవధిని 12 నుండి 16 వారాల వరకు పొడిగించినట్లు తెలిపింది. అదే విధంగా ఉద్యోగి కుటుంబానికి కొత్త చేరికను స్వాగతించడంలో ఉన్న ప్రత్యేక సవాళ్లను గుర్తిస్తూ.. OCI జనవరి 1 నుండి “బేబీ బోనస్” కింద OMR900 ని అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచి 10 రోజుల పేరెంటల్ లీవ్‌ను అందించనున్నట్లు మరో ప్రైవేట్ సంస్థ ప్రకటించింది. ఇదే బాటలో పలు ప్రైవేట్ కంపెనీలు త్వరలో ప్రకటనలు చేయొచ్చని నిపుణులు అభిప్రాపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..