సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం: అజ్మాన్

- January 14, 2024 , by Maagulf
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం: అజ్మాన్

యూఏఈ: జనవరి 2024 నుండి ఎమిరేట్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌ల వాడకంపై నిషేధాన్ని విధించినట్టు అజ్మాన్ ప్రకటించింది. ఎమిరేట్‌లోని అన్ని షాపింగ్ సెంటర్లు,  సేల్స్ అవుట్‌లెట్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగించడాన్ని నిషేధించినట్లు సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో అజ్మాన్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 2024 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది.  రాష్ట్ర మార్కెట్లలో సింగిల్ యూజ్ ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించి 2022 సంవత్సరపు మంత్రివర్గ నిర్ణయం సంఖ్య (380) ప్రకారం.. సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన 2018 సంవత్సరపు ఫెడరల్ లా నంబర్ (2)కి అనుగుణంగా చట్టం చేసినట్టు వివరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com