'''టైటానిక్' చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్టైనర్.
- May 30, 2016
రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'టైటానిక్'. 'అంతర్వేది టు అమలాపురం' ట్యాగ్ లైన్. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా. సహ నిర్మాత అట్లూరి సురేష్‌బాబు మాట్లాడుతూ '''టైటానిక్' చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్టైనర్. 'అంతర్వేది నుండి అమలాపురం' వరకు గోదావరి నదిలో టైటానిక్ అనే లాంచీలో జరిగే కథే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా నటిస్తుంటే రఘుబాబు విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే జబర్దస్త్ టీం, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఏఎన్నార్, జూనియర్ కృష్ణ, జూనియర్ పవన్ కళ్యాణ్ కామెడి సినిమాకు ప్లస్ అవుతుంది. రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్ ను టైటానిక్ గా రూపొందించి షూటింగ్ చేశాం. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. రీసెంట్ గా యాజమాన్య సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఎంటర్ టైనింగ్ ఉందని యూనిట్ ను అభినందించారు. రాజవంశీ సినిమా చాలా చక్కగా తెరకెక్కించారు'' అన్నారు.
పృథ్వీ, రఘుబాబు, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్ః స్వామిరారా, పిల్ల జమీందార్ చిత్రాల ఫేమ్ చంద్రకిరణ్, ఫైట్స్ః రాం సుంకర, ఆర్ట్ః రఘుకులకర్ణి.కె, మ్యూజిక్ః వినోద్ యాజమాన్య, ఎడిటర్ః ఎమ్.ఆర్.వర్మ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీః అమర్, సహా నిర్మాతః అట్లూరి సురేష్ బాబు, నిర్మాతః కె.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం: జి.రాజవంశీ.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







