ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన తారక్, కల్యాణ్‌రామ్
- January 18, 2024
హైదరాబాద్: నేడు టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి ఈసందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న తారక్.. ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. మరోవైపు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొన్నది.
కాగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ అభిమానులు తొలగించడం వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున ఎన్టీఆర్.. తాతకు నివాళులర్పించి వెళ్లారు. అనంతరం అక్కడికి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి బాలకృష్ణ చేరుకున్నారు. ఆయన అంజలి ఘటించిన వెళ్లిన తర్వాత.. టిడిపి కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు.. అక్కడున్న తారక్ ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించి పక్కకు పెట్టారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







