ఖతార్‌లో 'ఫ్రూట్స్ వీక్'ని ప్రారంభించిన జపాన్
- January 20, 2024
దోహా: జపాన్ వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ది-పెర్ల్ ఖతార్‌లోని జుంకో రెస్టారెంట్లో జపనీస్ ఫ్రూట్స్ వీక్ ప్రారంభం అయింది. ఖతార్‌లోని జపాన్ రాయబారి హెచ్ఈ సతోషి మేడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఇది జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ క్రౌన్ మెలోన్, వైట్/పింక్/రెడ్ స్ట్రాబెర్రీ, ఆర్గానిక్ అన్నో స్వీట్ పొటాటో, గ్రేప్స్, ఆపిల్, లెమన్, హరుకా రసం, డెకోపాన్ జ్యూస్‌తో సహా విభిన్న శ్రేణి జపనీస్ పండ్ల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. విదేశీ ఎగుమతులలో పెరుగుతున్న ట్రెండ్ ను ఆయన వివరించారు. జపాన్ ఫ్రూట్స్ రుచితో పాటు భద్రత ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. జపనీస్ పండ్ల అధిక నాణ్యత కారణంగా వాటి ధరలు కాస్తా అధికంగా ఉంటాయన్నారు. జపాన్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (J-FEC) చైర్మన్ యోషిహిసా హిషినుమా మాట్లాడుతూ.. ఇది దేశంలో ప్రారంభమైన జపనీస్ ఫ్రూట్స్ వీక్ ఈవెంట్ అని, ఖతార్‌కు అధిక నాణ్యత గల జపనీస్ పండ్లను పరిచయం చేయడం, వ్యాపార అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







