పూరీ సినిమా కోసం మళ్లీ ఐటెం అవతారమెత్తబోతున్న తెలుగమ్మాయ్.!
- January 22, 2024
పదహారణాల తెలుగమ్మాయ్ డింపుల్ హయాతి.. హీరోయిన్ అవ్వాలని గంపెడాశతో ఇండస్ర్టీకి అడుగుపెట్టింది. అయితే, తొలి పరిచయంగా ఐటెం సాంగ్‌తోనే డెబ్యూ చేసింది. అదే ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో ‘సూపర్ హిట్టూ.. బొమ్మ హిట్టూ..’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించి మెప్పించింది డింపుల్.
ఆ తర్వాత మాస్ రాజా రవితేజ సినిమా ‘ఖిలాడీ’తో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. గోపీచంద్‌తో ఓ సినిమాలో నటించింది. ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
అయితే, తాజా సమాచారం ప్రకారం మళ్లీ ఐటెం అవతారమెత్తేందుకు డింపుల్ హయాతీ రెడీగా వుందని తెలుస్తోంది. పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న హై ఎక్స్‌పెక్టేషన్స్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’లో డింపుల్ స్పెషల్ సాంగ్ చేయబోతోందట.
పూరీ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఓ ప్రత్యకత వుంటుంది. అలాగే, మళ్లీ తన ఐటెం సాంగ్ హిట్టయితే.. డింపుల్‌కి అవకాశాలు పోటెత్తుతాయేమో.. అవి హీరోయిన్‌గా అయినా.. లేదంటే ఐటెం గాళ్‌గా అయినా.! చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







