రైట్ టైమ్.! ‘జై హనుమాన్’ బిగిన్స్.!
- January 23, 2024
ఓ వైపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం. అంతా రామ మయం. జగమంతా రామ మయం. జై శ్రీరామ్ అన్న నినాదంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది. సరిగ్గా ఇదే వేళలో ‘హనుమాన్’ మూవీ సీక్వెల్ కూడా స్టార్ట్ చేసేశారు ప్రశాంత్ వర్మ అండ్ టీమ్.
‘హనుమాన్’ సినిమా చివరిలోనే సీక్వెల్‌కి బ్లాక్ వదిలేశారు. రెండో పార్ట్ అంతా హనుమాన్ మీదే వుండబోతోందనీ హింట్ ఇచ్చారు. నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను.. నువ్వు శ్రీరాముడికిచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది హనుమా.! అందుకు నువ్వు తిరిగి రావాలి.. అంటూ విభీషణుడి పాత్రలో వున్న సముద్ర ఖని చెప్పిన డైలాగులతో ఈ సినిమా కథపై ఆసక్తి పెరిగింది.
అసలు శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన మాటేంటీ.? అసలు ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నదెవరు.? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తాయ్. అయితే, ఓ బిగ్ సెలబ్రిటీ హనుమాన్ పాత్రలో కనిపించబోతున్నాడనీ ప్రశాంత్ చెప్పేశాడు.
ఇప్పుడు ఆ మాట చుట్టూ అనేక అనుమానాలు. ఆ పాత్ర పోషించదగ్గ ఆ స్టార్ హీరో ఎవరు.? స్టార్ హీరోల్లో ఆ సత్తా ఎవరికి వుంది.? మెగాస్టార్ చిరంజీవినా.? లేక ఇంకెవరు.? ఇలా ఇప్పటి నుంచే ‘జై హనుమాన్’ అంచనాలు పెంచేస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







