పాలస్తీనియన్లకు మద్దతుగా అంబులెన్స్‌లు విరాళం
- January 23, 2024
బహ్రెయిన్: పాలస్తీనియన్లకు మద్దతుగా ఆరు అంబులెన్స్‌లను అల్-ఎస్లా సొసైటీ యొక్క కాఫ్ హ్యుమానిటేరియన్ సీఈఓ మొహమ్మద్ జాసిమ్ సయ్యర్.. రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) సెక్రటరీ జనరల్, బహ్రెయిన్ నేషనల్ కమిటీ సీఈఓ అయిన డాక్టర్ ముస్తఫా అల్ సయ్యద్ కు విరాళంగా అందజేశారు. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతు అందించడానికి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపారు. గాజాలోని పాలస్తీనియన్ ప్రజలకు మద్దతుగా బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించేందుకు కాఫ్ హుమిటేరియన్ రెండు మొబైల్ క్లినిక్‌లతో సహా ఆరు పూర్తిస్థాయి అంబులెన్స్‌లను అందించినట్లు ప్రకటించింది. జోర్డాన్ ద్వారా అంబులెన్స్‌లు రవాణా చేయబడతాయని, పాలస్తీనా ప్రజలకు అంబులెన్స్ సేవలను అందించడానికి స్ట్రిప్‌లోని అత్యవసర సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ మద్దతు లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు. బహ్రెయిన్ గాజాలోని ఆసుపత్రులకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించడానికి మద్దతునిస్తూనే ఉంటుందని డాక్టర్ అల్ సయీద్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







