ICBF రిపబ్లిక్ డే వేడుకలు..40 మందికి ఉచిత ICBF బీమా కవరేజీ అందజేత
- January 28, 2024
ఖతార్: ఇండియా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF), భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జనవరి 25న ICBF కంజానీ హాల్‌లో వారి 40వ వార్షికోత్సవ ఉత్సవాల వేడుకను నిర్వహించారు. ఇందులో వివిధ లేబర్ క్యాంపుల నుండి 100 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిభ, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. అనంతరం ICBF మేనేజింగ్ కమిటీ సభ్యులు స్పాన్సర్ చేసిన 40 తక్కవ ఆదాయం కలిగిన కార్మికులకు ఉచిత ICBF బీమా కవరేజీని అందజేశారు. ఐసిబిఎఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, భారత రాయబార కార్యాలయంలో మొదటి కార్యదర్శి డాక్టర్ వైబవ్ తాండలే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ICBFని ప్రశంసించారు. ICBF ప్రెసిడెంట్ షానవాస్ బావా మాట్లాడుతూ.. సంస్థ యొక్క నిబద్ధతను తెలియజేశారు. 40 సంవత్సరాల ఉత్సవంలో 40 కార్యక్రమాలను ప్రారంభించాలనే తమ ప్రణాళికను ఆయన ప్రకటించారు. రాబోయే రెండు సంవత్సరాలకు ఉచిత ICBF బీమా కవరేజీని పొందేందుకు 40 మంది కార్మికులను ఎంపిక చేసినట్లు వివరించారు. ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ ప్రెసిడెంట్ ఈపీ అబ్దుల్రెహ్మాన్, ఐసిబిఎఫ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ సామ్ బషీర్, ఐసిబిఎఫ్ మాజీ ప్రెసిడెంట్ నీలాంగ్షు డే లు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఐసిబిఎఫ్ జనరల్ సెక్రటరీ వర్కీ బోబన్ స్వాగతోపన్యాసం చేయగా.. ఐసిబిఎఫ్ మత్స్యకారుల సంక్షేమ శాఖ అధినేత శంకర్ గౌడ్ వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఐసిబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి ఈ కార్యక్రమానికి కో-ఆర్డినేటర్ గా వ్యవహారించారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ ముహమ్మద్ కున్హి, కోశాధికారి కులదీప్ కౌర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు జరీనా అహద్, సమీర్ అహ్మద్, అబ్దుల్ రవూఫ్ కొండోట్టి, కుల్వీందర్ సింగ్ హనీ, సలహా మండలి సభ్యులు హరీష్ కంజాని టి రామసెల్వం, అపెక్స్ బాడీ సభ్యులు, వివిధ అనుబంధ సంస్థల ప్రతినిధులు, వివిధ కమ్యూనిటీ నాయకులు కూడా హాజరయ్యారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







