సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- June 29, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ లో ఉన్న రాస్ తనురా వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతోపాటు అరబ్ మరియు గల్ఫ్ దేశాలు సంతాపం తెలియజేఃస్తున్నాయి.
ఈ విషాద సంఘటన నేపథ్యంలో సౌదీ అరేబియాకు జోర్డాన్ రాజు అబ్దుల్లా పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. జోర్డాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అంబాసిడర్ ఫౌద్ మజాలీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కూడా ఈ ప్రమాదంపై రాజు సల్మాన్‌కు తన సంతాపం తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఓదార్పు కలగాలని ప్రార్థించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా సంతాప సందేశాన్ని పంపించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్ లు తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలోయూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మృతుల కుటుంబాలకు, ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
ఈ విషాద ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియాకు గల్ఫ్ సహకార మండలి (GCC) సంఘీభావం తెలుపుతుందని సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్-బుదైవి తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







