సౌదీ అరేబియాలో కాన్సుల్ జనరల్‌గా తెలుగు దౌత్యవేత్త నియామకం
- January 31, 2024
జెద్దా: జెద్దాలో భారత కాన్సుల్ జనరల్‌గా తెలుగు యువ దౌత్యవేత్త ఫహాద్ అహ్మద్ సూరీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఫహాద్ అహ్మద్ సూరీ ప్రస్తుతం వాణిజ్య మంత్రిత్వ శాఖలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రీకా దేశాలతో భారత ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. అంతకు ముందు ఆయన కువైట్ లోని భారతీయ ఎంబసీలో పనిచేసారు. కరోనా సంక్షోభంలో మిషన్ వందే భారత్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు.
కర్నూలు నగరంలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన ఫహాద్ స్థానిక జి.పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు.ఆ తర్వాత బెంగుళూరులో ఎంబీఏ చేసి లండన్‌లో బ్యాంకర్‌గా పని చేసిన అనంతరం సివిల్స్ పరిక్షలో I.F.Sకు ఎంపికయ్యారు.రాజకీయ, సైనిక, లక్షలాది మంది హాజ్ యాత్రికుల రాకపోకల దృష్ట్యా జెద్దాలోని కాన్సుల్ జనరల్ పోస్టింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటి వరకు జెద్దాలో పని చేసిన షాహీద్ ఆలంను లండన్‌లోని భారతీయ హైకమీషన్‌కు బదిలీ చేసారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







