లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం..
- February 04, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది. ప్రశాంతి హిల్స్ డీఎంఎస్ (DMS) అనే సంస్థ లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బహుమతులు ఇస్తామని నమ్మించింది. లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం, కారు, వెండి, బైకులు, ఫ్రిడ్జ్ టీవీ, వాషింగ్ మిషన్, మొబైల్స్ బహుమతిగా ఇస్తామని ఊరించింది. ఇదేదో ఆఫర్ అదిరిపోయింది అంటూ.. చాలామంది అట్రాక్ట్ అయ్యారు. లక్కీ డ్రా లో ఇస్తామన్న బహుమతులకు ఆశపడ్డారు. ఇంకేముంది లక్కీ డ్రాలో చేరిపోయారు. అలా.. 3వేల మెంబర్ షిప్ లు చేయించింది సంస్థ. ఒక్కో వ్యక్తి నుండి ప్రతి నెల 1100 రూపాయలు వసూలు చేసింది.
అయితే, రోజులు గడుస్తున్నా బహుమతులు మాత్రం ఇవ్వడం లేదు. నిర్వాహకులు ఎలాంటి గిఫ్టులు ఇవ్వకుండా కాలం గడిపేశారు. చివరికి బోర్డు తిప్పేసి పారిపోయారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకుని బాధితులు లబోదిబోమన్నారు. డీఎంస్ నిర్వాహకులు ముద్దగొని మదన్ గౌడ్, ముద్దగొని శివ గౌడ్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్కీ డ్రా పేరుతో డీఎంస్ సంస్థ నిర్వాహకులు 5 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది.
కాగా.. ఈ సంస్థ టార్గెట్ పేద, మధ్య తరగతి వాళ్లే అని పోలీసుల విచారణలో తెలిసింది. గతంలో ఈ సంస్థపై మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







