వాతావరణ హెచ్చరిక: రాబోయే వారం రోజుల్లో భారీ వర్షాలు
- February 08, 2024
యూఏఈ: రాబోయే వారం రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఆదివారం నుండి మంగళవారం వరకు ఎగువ వాయుగుండం క్రమంగా తీవ్రమవుతుందని, ఇది అక్కడక్కడా వర్షాలకు కారణం అవుతుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో దుమ్ము, ఇసుక 15 - 25 వేగంతో గంటకు 45 కి.మీ.కు చేరుకుంటుందన్నారు. ఫిబ్రవరి 4న యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. జెబెల్ జైస్ పర్వతాలలో 3.4 ° C వద్ద గడ్డకట్టే స్థాయికి పడిపోయింది. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్‌లో శనివారం (ఫిబ్రవరి 3) ఉదయం 5 గంటలకు చలి 4.2ºC నమోదైంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







