సోమాలియాలో ఉగ్రవాదుల దాడి..ముగ్గురు యూఏఈ సైనికులు మృతి

- February 11, 2024 , by Maagulf
సోమాలియాలో ఉగ్రవాదుల దాడి..ముగ్గురు యూఏఈ సైనికులు మృతి

యూఏఈ: సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో యూఏఈ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు,  ఒక బహ్రెయిన్ అధికారి మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో మరో ఇద్దరికి గాయాలైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  రెండు దేశాల మధ్య సైనిక సహకార ఒప్పందంలో భాగంగా సోమాలి సాయుధ దళాలకు శిక్షణ ఇస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. సైనికుల కుటుంబాలకు రక్షణ మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని తెలియజేసింది. దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com