నేరాల డాక్యుమెంట్ ప్రచురణపై అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- February 11, 2024
రియాద్: అన్ని రకాల నేరాలు జరిగిన సమయంలో ఫోటో తీయడం, ప్రచురించడం వంటివి చేయకూడదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క భద్రతా ప్రతినిధి కల్నల్ తలాల్ అల్-షల్హౌబ్ హెచ్చరించారు. ఇది సైబర్ క్రైమ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ డిఫెన్స్ షో 2024లో “సౌదీ స్ట్రీట్” కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఒక నేరం లేదా నిర్దిష్ట సంఘటన ప్రత్యక్షంగా చిత్రీకరించిన ఫుటేజీని తప్పనిసరిగా భద్రతా అధికారులకు సమర్పించాలని, భద్రతా కార్యకలాపాల కేంద్రం 911లోని భద్రతా సిబ్బందికి తెలియజేయాలన్నారు. అటువంటి డాక్యుమెంటేషన్‌ను సోషల్ మీడియా డొమైన్లో ఎప్పుడూ పోస్ట్ చేయరాదని లేదా ప్రచురించకూడదని స్పష్టం చేశారు. డాక్యుమెంటేషన్ అనేది ఫోటోగ్రఫీకి మాత్రమే పరిమితం కాదని, స్టోర్లు, మార్కెట్లు మరియు ఇతర చోట్ల ఏర్పాటు చేసిన భద్రతా నిఘా కెమెరాల రికార్డింగ్‌లను కూడా పబ్లిక్ డొమైన్ లలో ప్రచురించడాన్ని కలిగి ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







