సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ డైనమిక్..ఐఎంఎఫ్ చీఫ్
- February 14, 2024
రియాద్: ఆర్థిక వైవిధ్యం విషయంలో సౌదీ అరేబియాలో వచ్చిన మార్పు అద్భుతమని అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. దుబాయ్‌లో జరిగిన అరబ్ ఫిస్కల్ ఫోరమ్‌లో భాగంగా అల్-అరేబియా బిజినెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌదీ అరేబియాలో వచ్చిన మార్పు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సౌదీఅరేబియా యొక్క ఆర్థిక వ్యవస్థ చమురు మరియు గ్యాస్ రంగాలపై ఎక్కువగా ఆధారపడటం నుండి చమురుయేతర రంగాలలో మరింత డైనమిక్‌గా మారిందన్నారు. ఆర్థిక వైవిధ్యతకు సంబంధించి రాజ్యం తన విజన్ 2030ని సాధించడానికి అనుసరిస్తున్న విధానాన్ని అభినందించారు. సౌదీ అరేబియాలో టూరిజం విస్తరణ ఆశాజనకంగా ఉందని ఆమె అన్నారు. కార్మిక మార్కెట్లో మహిళల భాగస్వామ్యం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా మారిందని, వాస్తవానికి ఇది సౌదీ ఆర్థిక వ్యవస్థకు అదనపు ఊపునిస్తుందని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







