భారీ వర్షాలతో నీటమునిగిన షార్జాలోని కల్బా నగరం..
- February 15, 2024
యూఏఈ: యూఏఈ తూర్పు ప్రాంతంలో గత మూడు రోజులుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో షార్జా మున్సిపాలిటీ పరిధిలోని కల్బా పట్టణంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. నీటిలో మునిగిపోయిన రహదారులను అధికారులు బ్లాక్ చేశారు. పలు ప్రాంతాల్లో వరద నీటిని తొలగించేందుకు యత్నిస్తున్నట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని ఇప్పటికే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాల్లోని హోటళ్లు, పాఠశాలలకు తరలించినట్లు వెల్లడించారు. బాధిత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అధికారులు కల్బాలోని అల్ సిద్రా పార్క్ సమీపంలో పాఠశాల బస్సులను ఉపయోచించారు. వరదనీరు కారణంగా వ్యాపారాలు స్తంభించాయి. కల్బా లో అనేక వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. రికవరీ వాహనాలు అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయి. నీటిలో మునిగిపోయిన వాహనాలను వెలికితీసేందుకు సిబ్బంది పని చేస్తున్నారు. మరోవైపు నిరాశ్రయులైన వారిని ఆదుకోవడానికి వివిధ సామాజిక సంస్థలు రంగంలోకి దిగాయి. నివాసితులకు అవసరమైన నిత్యవసరాలను అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







