2023లో 44 శాతం పెరిగిన జర్నలిస్టుల మరణాలు..!
- February 17, 2024
బహ్రెయిన్ : 2023లో మరణించిన 99 మంది జర్నలిస్టులలో డెబ్బై రెండు మంది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించారని జర్నలిస్టుల రక్షణ కమిటీ(CPJ) తెలిపింది. గాజా, ఇజ్రాయెల్ మరియు లెబనాన్‌లలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. 2015 నుండి మరణాల సంఖ్య పెరుగుతుందని, 2022 గణాంకాలతో పోల్చుకుంటే దాదాపు 44 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. పాలస్తీనాలో నమోదైన జర్నలిస్టుల మరణాలుజర్నలిజంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని CPJ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్‌బర్గ్ అన్నారు. ఫిలిప్పీన్స్, సోమాలియాతో పాటు మెక్సికో ప్రపంచంలో పత్రికా రంగానికి అత్యంత ఘోరమైన దేశాలలో ఒకటి అని CPJ వెల్లడించింది. హింస కారణంగా చాలామంది తమ జర్నలిజాన్ని విడిచిపెడుతున్నట్లు CPJ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







