దుబాయ్ మెట్రో ఉల్లంఘనలకు Dh2000 వరకు జరిమానాలు
- February 19, 2024
యూఏఈ: ప్రజా రవాణా వ్యవస్థలో దుబాయ్ మెట్రో ఎమిరేట్ ముఖ్యమైన భాగంగా మారింది. సురక్షితమైన, వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది నివాసితులకు మరియు పర్యాటకులకు సేవలందిస్తుంది. అయితే, జరిమానాలను నివారించడానికి మెట్రోను ఉపయోగిస్తున్నప్పుడు నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. స్మోకింగ్ ఆంక్షలు, చెత్త చేయడంపై నిషేధం, టిక్కెట్ ధ్రువీకరణ వంటి నిబంధనలను పాటించడంలో వైఫల్యం పెనాల్టీలకు దారితీయవచ్చు.
ప్రజా రవాణా సౌకర్యాలు మరియు సంబంధిత రవాణా సేవలను ఉపయోగించడం, లేదా ఖచ్చితమైన ఛార్జీ చెల్లించకుండా ఫేర్ జోన్ ప్రాంతాల్లోకి ప్రవేశించడం/నిష్క్రమించడం చేస్తే Dh200 జరిమానా విధిస్తారు. నోల్ కార్డ్‌ను చూపించడంలో విఫలమైతే Dh200, వేరొకరి కోసం కేటాయించిన కార్డ్‌ని ఉపయోగించడం Dh200, గడువు ముగిసిన కార్డ్ ని ఉపయోగించడం Dh200, అథారిటీ నుండి ముందస్తు అనుమతి లేకుండా నోల్ కార్డులను అమ్మడం Dh200, నకిలీ కార్డును ఉపయోగించడం Dh500,
ప్రజా రవాణా, ప్రజా సౌకర్యాలు మరియు సేవల వినియోగదారులకు ఏ విధంగానైనా భంగం లేదా అసౌకర్యం కలిగించడం Dh100, నిర్దిష్ట కేటగిరీలు కోసం నిర్దేశించిన ప్రాంతాల్లోకి ప్రవేశించడం Dh100, నిషేధించబడిన ప్రదేశాలలో తినడం మరియు త్రాగడం Dh100, ప్రయాణీకుల షెల్టర్లలో పడుకోవడం Dh300, ప్రజా రవాణా, ప్రజా సౌకర్యాలపై పరికరాలు లేదా సీట్లు దెబ్బతీయడం, ధ్వంసం చేయడం లేదా నాశనం చేయడం Dh2,000 జరిమానాలు విధిస్తారు. ఒకవేల జరిమానా విధిస్తే ప్రయాణీకుడు జరిమానాను అక్కడికక్కడే జారీ చేసిన ఇన్స్పెక్టర్కు చెల్లించవచ్చు. లేకపోతే ఆ మొత్తాన్ని రోడ్డు మరియు రవాణా అథారిటీ (RTA) పోర్టల్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే విధించిన జరిమానాను ఛాలెంజ్ చేసేందుకు ఇమెయిల్ ద్వారా 'ఫైన్ అప్పీల్' అనే సబ్జెక్ట్ టైటిల్ మరియు ఫైన్ నంబర్‌తో [email protected]కి ఇమెయిల్ పంపవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







