ల్యాండింగ్ అయిన 30 నిమిషాలలోపు చెక్-ఇన్ పూర్తవ్వాలి..!
- February 19, 2024
కువైట్: భారతదేశంలో పనిచేస్తున్న ప్రధాన విమానయాన సంస్థలలో బ్యాగేజీ నిర్వహణ విధానాలను క్రమబద్ధీకరించడానికి భారతదేశపు పౌర విమానయాన భద్రత బ్యూరో (BCAS) కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాగేజీని సకాలంలో అందజేయడానికి అవసరమైన చర్యలను అమలు చేయాలని కోరుతూ విమానయాన సంస్థలకు లేఖలు రాసింది. BCAS ఇండియాలోని ఆరు ప్రధాన విమానాశ్రయాలలో విస్తృతమైన సర్వేను నిర్వహించింది. ఈ సందర్భంగా ఏడు విమానయాన సంస్థల కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించింది. వాటి బ్యాగేజీ డెలివరీ ప్రక్రియలతో పాటు 3600 విమానాల కదలికలను విశ్లేషించింది. నిబంధనల ప్రకారం.. విమానం ఇంజన్ షట్‌డౌన్ అయిన తర్వాత 10 నుండి 30 నిమిషాల వ్యవధిలో ప్రయాణీకుల సామాను డెలివరీ అయ్యేలా ఎయిర్‌లైన్స్ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కాగా, ఏ ఎయిర్‌లైన్స్ కూడా నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేదని నిర్ధారించారు. ఇంజిన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి సామాను కన్వేయర్ బెల్ట్‌కు చేరుకోవాలని లేఖలో సూచించారు. ఫిబ్రవరి 26 తేదీలోపు అవసరమైన చర్యలను అమలు చేయడానికి ఎయిర్‌లైన్స్‌కు BCAS 10 రోజుల గడువు విధించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







