పర్యావరణ ఉల్లంఘనలు.. 17 మంది అరెస్ట్

- February 27, 2024 , by Maagulf
పర్యావరణ ఉల్లంఘనలు.. 17 మంది అరెస్ట్

కువైట్: నేషనల్ డే వేడుకల సందర్భంగా అధికారులు 30 పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేశారు. ఇందులో వాటర్ బెలూన్లు విసిరినందుకు పర్యావరణ పోలీసులు 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.  అలాగే వాటర్ బెలూన్లు, ఫోమ్ క్యాన్లు, వాటర్ పిస్టల్స్ విక్రయించినందుకు 13 ఉల్లంఘనలను నమోదు చేశారు. జాతీయ సెలవుదినాలను జరుపుకోవడంలో ప్రతికూల విషయాలను తగ్గించడానికి, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా లేదా ఏదైనా ప్రతికూల ప్రవర్తనలను అడ్డుకునేందుకు కఠినంగా మరియు తక్షణమే స్పందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ వేడుకల మార్గదర్శకాలను ఉల్లంఘించే ఎవరైనా సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com