అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ బౌలర్
- February 27, 2024
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 37ఏళ్ల వాగ్నర్ న్యూజిలాండ్ తరపున చాలా సందర్భాల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐసీసీ వెబ్ సైట్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. వాగ్నర్ మాట్లాడుతూ ఈ వారం చాలా ఎమోషనల్ గా గడిచింది. మీరు చాలాకాలంగా అనుబధం ఉన్నదానినుంచి సులభంగా దూరంగా ఉండలేరు. న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నేను నా భార్య లానాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. ఆమె నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందంటూ నీల్ వాగ్నర్ పేర్కొన్నారు.
వాగ్నర్ 64 టెస్టుల్లో 260 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్ లో 73 పరుగులకు 9 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించాడు. వాగ్నర్ 84 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 874 పరుగులు చేశాడు. అందులో ఒక హాప్ సెంచరీ కూడా ఉంది. వాగ్నర్ ఇండియాపై అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 2014లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఆక్లాండ్ లో జరిగింది. న్యూజిలాండ్ బౌలర్ వాగ్నర్ ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను వాగ్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







