కన్నడలో నాగరహవు, తెలుగులో శివనాగం
- June 03, 2016
దేవి, అమ్మోరు. దేవీపుత్రుడు, అరుంధతి లాంటి వెరైటీ మూవీలు తెర కెక్కించిన దర్శకుడు కోడి రామకృష్ణ కొన్నాళ్ళుగా టాలీవుడ్ కి దూరమయ్యాడు. అయితే ఇందుకు కారణం కన్నడలో ఓ భారీ చిత్రాన్ని తీస్తుండడమే. కన్నడలో నాగరహవు, తెలుగులో శివనాగం టైటిల్ తో తీస్తున్న ఈ చిత్రంలో దివంగత కన్నడ స్టార్ విష్ణువర్ధన్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపించడం విశేషం. టాప్ హీరోయిన్ రమ్య నాగకన్యగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. వీ ఎఫ్ ఎక్స్ ద్వారా 120 అడుగుల పామును సృష్టించడం చెప్పుకో దగినది.1972 లో వచ్చిన నాగరహవు సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. కన్నడ హీరోలు విష్ణువర్ధన్, అంబరీష్ దీంతో టాప్ స్టార్స్ అయ్యారు. ఇప్పుడు అదే టైటిల్ తో వస్తోందీ చిత్రం.2009 లోనే విష్ణువర్ధన్ మరణించాడు. కానీ గ్రాఫిక్స్ ద్వారా సి జీలో ఆయన పాత్రను సృష్టించారు. హాలీవుడ్ చిత్రాల్లో మాత్రమె ఉపయోగించే టెక్నాలజీని ఇందులో వాడడం విశేషం. 7 దేశాల్లోని 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజులపాటు ఈ సినిమా కోసం పని చేశారట. యూ-ట్యూబ్ లో ఈ టీజర్ ను అప్ లోడ్ చేసిన ఒక్క రోజులోనే రెండున్నర లక్షలమంది చూశారని తెలిసింది. ఈగ, బాహుబలి వంటి సినిమాలకు వర్క్ చేసిన మకుట విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ కానున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







