ఎంత మంది చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే ఈ ఈ-టిక్కెట్
- June 02, 2016
చారిత్రక చార్మినార్ కట్టడం సందర్శకులకు బుధవారం నుంచి ఈ-టికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ సర్కిల్ పురాతత్వ సర్వేక్షణ విభాగం సూపరింటెండెంట్ ఎన్.తహర్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-టికెట్ విధానంలో పారదర్శకత ఉంటుందన్నారు. భారతీయ సందర్శకులకు రూ.15, విదేశీయులకు రూ.200 ప్రవేశ రుసుముగా వసూలు చేస్తున్నామన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, అయినా వీరికి సైతం ఉచిత ఈ-ప్రవేశ టికెట్ జారీ చేస్తున్నామన్నారు. ఎంత మంది పిల్లలు చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే దీన్ని అమలు చేస్తున్నామన్నారు.పురావస్తు సర్వేక్షణ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్, సర్వేయర్ ప్రశాంత్, చార్మినార్ ఇంఛార్జి డాక్టర్ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







