సోలార్ పవర్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- February 29, 2024
న్యూఢిల్లీ: కోటి గృహాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజిలీ యోజన’ పథకానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తుంది. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందగలుగుతారని వెల్లడించారు. ఇక పథకం కింద ఎంపికైన వారికి రూ.30వేలు(1kw రూఫ్‌టాప్ సోలార్), రూ.60వేలు(2kw) చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు.
అంతేకాకుండా ఈ సమావేశంలో మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మాణాన్ని 100 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









