ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా
- February 29, 2024
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ. 30 లక్షల జరిమానా విధించింది. 80 ఏళ్ల వఅద్ధుడు తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుండి ముంబయి చేరుకున్నాడు. విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అనంతరం విమానం నుండి టెర్మినల్ వరకు వీల్‌చైర్ ఏర్పాటు చేయకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించాడు. అయితే కొంత దూరం నడిచిన అనంతరం ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరిగింది. ఈ ఘటనపై డిజిసిఎ తీవ్రంగా స్పందించింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా వివరణనిస్తూ.. ఆ వృద్ధుని భార్యకు వీల్ చైర్ ఏర్పాటు చేశామని, మరొకటి ఏర్పాటు చేసే వరకు వేచి ఉండాలని సిబ్బంది కోరారని పేర్కొంది. అయితే ఆ వృద్ధుడు నడిచివెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపింది.
ఎయిరిండియా సంబంధిత నిబంధనలు ఉల్లంఘించిందని, రూ. 30 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. ప్రయాణికులకు వీల్‌చైర్ సమకూర్చడంపై విధి విధానాలు తప్పక పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







