లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అవగహనా కార్యక్రమం
- June 03, 2016
ఎనిమిదేళ్ళ ఒబైదా ఇబ్రహీం అల్ అక్రాబావి అనే చిన్నారి హత్య నేపథ్యంలో దుబాయ్ పోలీసులు సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ని నిర్వహించారు. 48 ఏళ్ళ వ్యక్తి ఒబైదా ఇబ్రహీమ్ అల్ అక్రాబివి అనే చిన్నారిని కిడ్నాప్ చేసి హతమార్చిన ఘటన కలకలం సృష్టించింది. దాంతో చిన్నారుల భద్రతపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని దుబాయ్ పోలీస్ నిర్ణయానికి వచ్చింది. 17 సెకెన్ల నిడివిగల ఓ వీడియోని దుబాయ్ పోలీసులు ఆన్లైన్లో విడుదల చేశారు. మే 31 నుంచి రెండు సెట్ల కార్టూన్స్‌ని కూడా విడుదల చేశారు. ఎందుకంటే కార్టూన్ల పట్ల పిల్లలు త్వరగా ఆకర్షితులై అందులోని భావాన్ని అర్థం చేసుకోగలరనే ఉద్దేశ్యంతోనే. కొత్తవారితో పరిచయం ఎంత ప్రమాదకరమో వీటిల్లో సవివరంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో మే 20న ఒబైదాని అపహరించారు. మే 22న అకడమిక్ సిటీ రోడ్లో ఒబైదా మృతదేహం దొరికింది. లైంగికంగా ఒబైదాను వేధించి చంపేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







