900 మంది ఉద్యోగులకి గుడ్ బై చెప్పనున్న సోనీ కంపెనీ
- March 01, 2024
టెక్ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ (Sony) కి చెందిన ప్లేస్టేషన్ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 8 శాతం అంటే 900 మందిని త్వరలో తొలగించనుంది. పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది.
పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. భవిష్యత్తు కోసం వ్యాపారాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. గేమర్లు, డెవలపర్ల అంచనాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భవిష్యత్తు టెక్నాలజీలను గేమింగ్‌లోకి తీసుకెళ్లాలి. అందుకే ఈ విభాగంలో అత్యున్నత ఫలితాలు ఇవ్వడం కోసం మేం ఒక అడుగు వెనక్కి వేశాం. ఇది సవాళ్లతో కూడిన సమయం. అంతేకానీ, ఇది మా బలహీనతను సూచించదు అంటూ సోనీ ఇంటరాక్టీవ్ ఎంటర్‌టైన్మెంట్ సీఈవో జిమ్ ర్యాన్ బ్లాగ్‌లో చేసిన ఓ పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు లండన్ ప్లేస్టేషన్ స్టూడియోను పూర్తిగా మూసివేయనున్నారు. దీని ఆధీనంలోని ఫైర్‌స్పిరిట్ స్టూడియోస్ సిబ్బందిలో కూడా కోత విధించే అవకాశం ఉంది. మరోవైపు సోనీ ఇంటరాక్టీవ్ ఎంటర్‌టైన్మెంట్‌లోని వివిధ విభాగాల్లో కూడా లేఆఫ్‌లు కొనసాగుతాయి. ఉద్యోగులను తొలగించే సమయంలో వారికి అందాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







