బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 17మంది దుర్మరణం : తమిళనాడు
- June 03, 2016
తమిళనాడులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లా నేల్ మలై సమీపంలో ఓ ప్రయివేటు బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 17మంది దుర్మరణం చెందారు. మరో 15మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 33మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా బెరిగాయ్ నుంచి కృష్ణగిరి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.కాగా కర్ణాటక నుంచి వేరుశెనగ లోడుతో వస్తున్న లారీ అయిదో నెంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పింది. లారీ ముందుగా బస్సును ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17మంది అక్కడికక్కడే మృతి చెందారు.మృతుల్లో 12ఏళ్ల చిన్నారి సహా ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. కాగా మృతుల వివరాలతో పాటు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







