ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్‌కి ఆహ్వానం
- June 03, 2016
సుల్తానేట్‌ని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెడ్డింగ్ ప్లానర్స్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇండియాకి చెందిన పలువురు ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్స్ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మే 30 నుంచి జూన్ 3 వరకు ఈ గ్రూప్ ఒమన్‌లో పర్యటించింది. తమ దేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు వెడ్డింగ్ డెస్టినేషన్స్‌గా ఉపయోగపడ్తాయనీ, దేశంలో టూరిజంను ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామనీ, ఈవెంట్స్ నిర్వహించడానికి, వెడ్డింగ్ ఈవెంట్స్ జరపడానికి తమ దేశం అనుకూలంగా ఉంటుందని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ టూరిజం ప్రమోషన్ అస్మా సలీమ్ అల్ హజ్రి చెప్పారు. రెండో అతి పెద్ద క్రూయిజ్ షిప్ పోర్ట్ సుల్తాన్ ఖబూస్లో మే 28 నుంచి కొలువుదీరింది. దీనికి సంబంధించిన విశేషాల్ని కూడా ఇండియన్ టీమ్‌కి వివరించారు. మిడిల్ ఈస్ట్ మార్కెట్లో బెస్ట్ అనిపించుకునేందుకు టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగంలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలతోపాటు, ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నామని ఒమన్ కన్వెన్షన్ బ్యూరో డైరెక్టర్ ఖాలిద్ ఈ సందర్భంగా వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







