ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్వామి బ్రహ్మవిహారిదాస్
- March 15, 2024
న్యూఢిల్లీ: BAPS స్వామినారాయణ్ సంస్థ తరపున స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సంధర్భంగా పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ ప్రత్యేకంగా ఆశీర్వదించిన ఒక హారాన్ని ప్రధానమంత్రికి అందించారు. అబుదాబి BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు దానిని పర్యవేక్షించినందుకు స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మందిరానికి సంబంధించిన సంక్షిప్త నివేదికను అందించారు. యూఏఈ కమ్యూనిటీ మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సందర్శకులు ఈ మందిర్‌ను చూసేందుకు వస్తున్నారని, మొదటి ఆదివారం 65,000 మంది సందర్శకులు వచ్చారని వివరించారు. మహా శివరాత్రి వంటి పండుగలను జరుపుకోవడానికి ఇది వేదికగా ఉందని, అటువంటి ఉత్సాహభరితమైన పండుగలు, ఆచారాలు మరియు సంప్రదాయాలను కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని యూఏఈ పాలకుల విశాల హృదయం మరియు మద్దతు కోసం కృతజ్ఞతలు తెలియజేశారు.అబుదాబిలోని BAPS హిందూ మందిర్‌ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న స్వామీజీలు, వాలంటీర్లను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







