సుమంత్ అశ్విన్‌తో మల్కాపురం శివకుమార్ నూతన చిత్రం!
- June 04, 2016
రొటిన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకునే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ హీరోగా మరో నూతన చిత్రం రూపొందనుంది. హీరో నితిన్‌తో ద్రోణ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వర్సెస్ సూర్య, శౌర్య వంటి విభిన్న చిత్రాలను నిర్మించి.. అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై నిర్మించబోతున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ వైవిధ్యమైన కథ, కథనాలతో చిత్రాలను తెరకెక్కించాలనే సంకల్పంతో మా సంస్థలో విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్నాను. అందులో భాగంగానే సుమంత్ అశ్విన్‌తో సరికొత్త కథ, కథనాలతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలుంటాయి. సుమంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోయే ఈ చిత్రం అత్యధిక బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







