చికెన్ ఎగ్ కర్రీ
- June 04, 2016
కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు: అరకప్పు(ఉడికించుకోవాలి), గుడ్లు: ఐదు లేక ఆరు, ఉల్లిపాయ పెద్దది: ఒకటి(సన్నగా తరిగిపెట్టుకోవాలి), టమోటా పెద్దది: ఒకటి(ముక్కలుగా చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు: నాలుగు లేక ఐదు(ముక్కలు చేసుకోవాలి), బ్లాక్ మిరియాల పొడి: రెండు స్పూన్లు, చాట్‌మసాలా: టేబుల్ స్పూను, తురిమిన చీజ్, ఉప్పు: రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్:రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు: కొద్దిగా, ఆలివ్ ఆయిల్: పావుకప్పు, పాలు: పావుకప్పు. కారం: టేబుల్ స్పూను, పసుపు: చిటికెడు
తయారీ విధానం: ముందుగా మందపాటి గిన్నె తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ వేసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్ది సేపు వేయించుకోవాలి. టమోటాలు ఉడుకుతున్న సమయంలో ఉప్పు, పసుపు వేసి మరికొద్దిసేపు వేయించాలి. అనంతరం ఉడికించిన చికెన్ ముక్కలు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చికెన్ ఉడుకుతున్న సమయంలో వేరొక గిన్నెలో గుడ్లు పగలకొట్టి, వాటికి పాలు జత చేసి బాగా గిలక్కొట్టుకుని చికెన్ కవర్ చేస్తూ పైన పోయాలి. కొద్దిసేపు మూత పెట్టి దించేసుకోవాలి. చివరగా చీజ్ ముక్కలు, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు పైన చల్లుకుంటే సరిపోతుంది
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







